logo

మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభం నేడే

మేడ్చల్‌ జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయం(కలెక్టరేట్‌) బుధవారం ప్రారంభం కానుంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 17 Aug 2022 02:34 IST


విద్యుత్తు వెలుగుల్లో నూతన భవన సముదాయం

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శామీర్‌పేట: మేడ్చల్‌ జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయం(కలెక్టరేట్‌) బుధవారం ప్రారంభం కానుంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు రోజుల నుంచి మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌ పలుమార్లు సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం బేగంపేట నుంచి నుంచి రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయల్దేరతారు. 2.55కు శామీర్‌పేట అంతాయిపల్లిలో కలెక్టరేట్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. 3.55కు బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు.


మేడ్చల్‌ కలెక్టరేట్‌ ప్రారంభానికి గ్రేటర్‌ నేతలు దూరం?

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి ‘గ్రేటర్‌’ నేతలకు ఆహ్వానం అందలేదు. గ్రేటర్‌ పరిధిలోని 36 డివిజన్లు మేడ్చల్‌ రెవెన్యూ జిల్లా కింద ఉంటాయి. జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశాలకు, ఎన్నికల ప్రక్రియలో, నగర సమన్వయ సమావేశాల్లోనూ కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొంటారు. కానీ.. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభానికి కార్పొరేటర్లతో పాటు నగర ప్రథమ పౌరురాలు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి సైతం ఆహ్వానం అందలేదని సంబంధిత అధికారులు ‘ఈనాడు’తో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని