logo

ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లే కీలకం

ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర చాలా కీలకమని, సంస్థ ఏది సాధించినా ఆ ఘనత వారిదేనని సంస్థ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మంగళవారం జేబీఎస్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అధికారులు...

Published : 17 Aug 2022 01:54 IST


జేబీఎస్‌లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న సజ్జనార్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర చాలా కీలకమని, సంస్థ ఏది సాధించినా ఆ ఘనత వారిదేనని సంస్థ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మంగళవారం జేబీఎస్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రయాణికులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, కవులతోపాటు సైన్యానికి సంబంధించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తిలకించారు.  పికెట్‌, కంటోన్మెంట్‌ డిపోలను సందర్శించి వివిధ రకాల బస్సులు, డిపోల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి కంటోన్మెంట్‌ డిపోను ఆనుకొని ఖాళీగా ఉన్న మూడెకరాల స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ వెంకన్న, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ యుగంధర్‌, సికింద్రాబాద్‌ డిప్యూటీ ఆర్‌ఎం జానిరెడ్డి, పికెట్‌, కంటోన్మెంట్‌ డిపోల మేనేజర్లు సురేశ్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని