logo

టీఎస్‌ఆర్టీసీ కొత్త రికార్డు

టీఎస్‌ఆర్టీసీ ఇటీవల రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. పంద్రాగస్టు సోమవారం రూ.20 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంది. టి-24 టికెట్‌తో 24 గంటలు..

Published : 17 Aug 2022 02:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఇటీవల రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. పంద్రాగస్టు సోమవారం రూ.20 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంది. టి-24 టికెట్‌తో 24 గంటలు బస్సులో మళ్లీ టిక్కెట్‌ కొనాల్సిన అవసరం లేకుండా ఎక్కడైనా ప్రయాణించవచ్ఛు స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న టి-24 టికెట్లపై భారీ రాయితీ ఇచ్చింది. రూ.120 ఉన్న ఈ టికెట్‌ను రూ.75కు తగ్గించడంతో నగరంలో వీటి అమ్మకాలు ఆగస్టు 15న భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో 11 వేలకు మించని టి-24 టిక్కెట్ల అమ్మకాలు.. సోమవారం 33వేలు అమ్ముడవ్వడంపట్ల ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రీజియన్లో 17,204, సికింద్రాబాద్‌న్లో 15,829 మంది కొన్నారని ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని