logo

అభిమానికి చిరంజీవి బాసట

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అభిమానిని హైదరాబాద్‌ రప్పించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌ చిరంజీవి అభిమాని.

Published : 17 Aug 2022 02:38 IST


చక్రధర్‌తో చిరంజీవి

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అభిమానిని హైదరాబాద్‌ రప్పించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌ చిరంజీవి అభిమాని. ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ స్థానికంగా చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సొంతూరి నుంచి నగరానికి రప్పించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒమేగా ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని