logo

దేశాన్ని పాలించే వారికి కనువిప్పు కలిగేలా కవిత్వం రాయండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

దేశాన్ని పరిపాలించే వారికి కనువిప్పు కలిగేలా కవిత్వం రాయాలని కవులను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

Published : 17 Aug 2022 02:54 IST


కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో అయాచితం శ్రీధర్‌, జూలూరు గౌరీశంకర్‌ తదితరులు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: దేశాన్ని పరిపాలించే వారికి కనువిప్పు కలిగేలా కవిత్వం రాయాలని కవులను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం ‘స్వాతంత్య్ర స్ఫూర్తి.. వజ్రోత్సవ దీప్తి’ అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాటాడారు. జూలూరు గౌరీశంకర్‌ సభకు అధ్యక్షత వహించారు. వేణుగోపాల్‌, డా.అయాచితం శ్రీధర్‌, ఖాజా ముజీబుద్దీన్‌, డా.రమా చంద్రమౌళి, రాములు, రేడియం, వనపట్ల సుబ్బయ్య, కందాళై రాఘవాచార్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని