logo

మహానగరంలో స్తంభించిన ట్రాఫిక్‌!

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జనగణమన గీతాలాపనతో మహానగరం మార్మోగింది. ఉదయం 11.30 గంటలకు కాలనీలు, బస్తీలు, ప్రధాన మార్గాల్లో ఎక్కడికక్కడ ప్రజలు జాతీయగీతం ఆలపించారు.

Published : 17 Aug 2022 02:54 IST


ఆబిడ్స్‌ సర్కిల్‌లో వాహనదారుల అవస్థలు

ఈనాడు, హైదరాబాద్‌ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జనగణమన గీతాలాపనతో మహానగరం మార్మోగింది. ఉదయం 11.30 గంటలకు కాలనీలు, బస్తీలు, ప్రధాన మార్గాల్లో ఎక్కడికక్కడ ప్రజలు జాతీయగీతం ఆలపించారు. పెద్ద ఎత్తున యువతీ యువకులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి చేరటంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ముందస్తు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లి, ఆబిడ్స్‌, నారాయణగూడ తదితర ప్రధాన మార్గాలో వాహనాలు బారులు తీరాయి. ముందుకెళ్లే అవకాశం లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు వరుస సెలవులతో ఊరెళ్లిన నగర వాసులు తిరిగి రావటంతో దారులపై రద్దీ మరింత పెరిగింది. కూడళ్ల వద్ద పోలీసులు లేకపోవటం... వాహనదారులు కొందరు నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణించటం సమస్యను జటిలం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని