అదృశ్యమా? నగదుతో ఉడాయింపా?.. ట్రాన్స్‌జెండర్‌ కనిపించకపోవడంపై రెండు ఫిర్యాదులు

ట్రాన్స్‌జెండర్‌ అదృశ్యమైన సంఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌-3, బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ట్రాన్స్‌జెండర్‌ కల్యాణ్‌(35).....

Updated : 17 Aug 2022 09:23 IST


కల్యాణ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ట్రాన్స్‌జెండర్‌ అదృశ్యమైన సంఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌-3, బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ట్రాన్స్‌జెండర్‌ కల్యాణ్‌(35) మరి కొద్దిమంది సహచరులతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 12న తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా ఉప్పరపాలేనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడకు రాలేదని సమాచారం రావడంతో అంతటా గాలించిన సహచరులు మంగళవారం ఉదయం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణ్‌ సహచరుడు వశీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కల్యాణ్‌ తమ అందరి వద్దా అప్పు రూపేణా రూ.30లక్షల వరకు తీసుకుని పరారయ్యాడని అతని సహచరులు మరికొందరు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని విచారించి అవసరమైతే సెక్షన్లు మారుస్తామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని