logo
Published : 17 Aug 2022 03:09 IST

నగరమంతా జనగణమన

ఐదు లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా


కోఠి ఉస్మానియా మహిళా కళాశాల ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన వేళ.. జాతీయ పతాకంతో విద్యార్థినుల ఉత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30గంటలకు ఎక్కడివారు అక్కడే నిల్చుని జాతీయ గీతం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబిడ్స్‌ పోస్టాఫీసు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనగా.. ఇతర ప్రజాప్రతినిధులు నగరవ్యాప్తంగా వారి నియోజకవర్గాలు, డివిజన్ల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖల కృషితో ఎలాంటి అవాంతరాలు లేకుండా సుమారు ఐదు లక్షల మంది ఒకేసారి జనగణమన ఆలపించినట్లు అంచనా. పోలీసులు, బల్దియా అధికారులు కూడళ్లలో సౌండ్‌ బాక్సులు పెట్టి, వేదికలు ఏర్పాటు చేశారు.

 


దివ్యాంగ విద్యార్థులతో కలిసి మెట్రోరైలులో జాతీయ గీతాలాపనలో మెట్రో అధికారులు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, కేవీబీ రెడ్డి


సికింద్రాబాద్‌ ప్యాట్నీ జంక్షన్‌లో జాతీయ జెండాలతో తరలివచ్చిన పాఠశాలల విద్యార్థులు


హయత్‌నగర్‌లో వేలాదిగా విద్యార్థులు..


ఆబిడ్స్‌ సర్కిల్‌లో..


ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో..


ఉప్పల్‌ కూడలిలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, ఇతర పోలీసులు


గచ్చిబౌలి విప్రో కూడలిలో సైబరాబాద్‌ డీసీపీ స్టీఫెన్‌ రవీంద్ర, చిత్రంలో డీసీపీ శిల్పవల్లి, ఎమ్మెల్యే గాంధీ తదితరులు


అతిరథులంతా ఒక్కచోట..


ఆబిడ్స్‌లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపిస్తున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, దానం
నాగేందర్‌, దయాకర్‌రావు, అసదుద్దీన్‌ ఒవైసీ, శ్రీనివాస్‌ గౌడ్‌, కె.కేశవరావు, శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌అలీ, తదితరులు

* ఉదయం పదకొండు గంటల ఇరవై అయిదు నిమిషాలకు సీఎం కేసీఆర్‌ అబిడ్స్‌ కూడలికి చేరుకున్నారు.

* ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

* సైరన్‌ మోగించగానే.. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన ప్రారంభమైంది.

* గీతాలాపన పూర్తి కావడంతో భారత్‌ మాతాకీ జై.. జై హింద్‌.. జై తెలంగాణ.. అనే నినాదాలు చేశారు.

* మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

* సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌పై కళాకారుల విన్యాసాలు అలరించాయి.

* చివరిగా కార్యక్రమ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు ధన్యవాదాలు తెల్పుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మ్యూజికల్‌ నైట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు.

* ప్రభుత్వ సిటీ కళాశాల, ఆలియా, మహబూబియా, ఖైరతాబాద్‌, ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌, ఇతర కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, అబిడ్స్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని