logo

ప్రాణం తీసిన అక్రమ విద్యుత్తు కనెక్షన్‌

ఓ వ్యాపారి నిర్లక్ష్యం..మహిళ రైతు ప్రాణాలు కోల్పోయేందుకు దారితీసింది. ఈ విషాదకర ఘటన తాండూరు మండలం ఎల్మకన్నెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన ప్రకారం..గ్రామానికి చెందిన కుర్వవెంకటప్ప

Published : 18 Aug 2022 03:05 IST

ఎల్మకన్నె(తాండూరుగ్రామీణ): ఓ వ్యాపారి నిర్లక్ష్యం..మహిళ రైతు ప్రాణాలు కోల్పోయేందుకు దారితీసింది. ఈ విషాదకర ఘటన తాండూరు మండలం ఎల్మకన్నెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన ప్రకారం..గ్రామానికి చెందిన కుర్వవెంకటప్ప, భార్య కళావతితో కలిసి మంగళవారం పొలానికి వెళ్లారు. సాయంత్రం భార్యాభర్తలు ఇంటికి బయలుదేరారు. పట్టణానికి చెందిన వ్యాపారి మున్నూరు మల్లేశం తన పొలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణానికి, నియంత్రిక నుంచి నిబంధనలకు విరుద్ధంగా త్రిఫేజ్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. ఆ తీగకు ఆధారంగా కర్రలు ఏర్పాటు చేశారు. అయితే దారిలో ఆయన ప్రహరీ వద్ద తీగ తేలిఉంది. ఈ విషయాన్ని గమనించకుండా,నడుచుకుంటూ వస్తున్న కళావతి కుడి చేయి తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. వెంకటప్ప కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే భార్య విగతజీవిగా మారడంతో వెంకటప్ప గుండెలు బాదుకుని రోదించాడు.  మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి శవపంచనామా నిర్వహించారు. వెంకటప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా తీగలు అమర్చి ఒకరి మృతికి కారణమైన వ్యాపారి నుంచి పరిహారం ఇప్పించి మృతురాలి కుటుంబసభ్యుల మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు నాయకులు మధ్యవర్తిత్వం చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని