logo

హామీ నెరవేర్చకపోవడంతోనే అడ్డుకున్నాం: భాజపా

పోలీసులు తెరాసకు కండువాలేని కార్యకర్తలుగా పనిచేస్తున్నారని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీలత ఆరోపించారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో

Published : 18 Aug 2022 03:05 IST

మాట్లాడుతున్న నాయకులు

తాండూరు, న్యూస్‌టుడే: పోలీసులు తెరాసకు కండువాలేని కార్యకర్తలుగా పనిచేస్తున్నారని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీలత ఆరోపించారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాండూరుకు మెడికల్‌ కళాశాల ఇస్తామన్న హామీని నెరవేర్చకపోవడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన భాజపా కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారన్నారు. ఈ విషయంలో ఇక్కడి తెరాస కార్యకర్తలు, నాయకులు ఆలోచించాలని సూచించారు. వికారాబాద్‌ బహిరంగ సభలో జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం ప్రధాన మంత్రి, భాజపాను మాత్రమే విమర్శించడం సీఎంకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని పోలీసులతో దెబ్బలు తిన్న కార్యకర్తలను సన్మానించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్‌, తాండూరు నియోజకవర్గం మాజీ ఇన్‌ఛార్జి పాండు, పెద్దేముల్‌ మండల అధ్యక్షుడు సందీప్‌  పాల్గొన్నారు. పోలీసులతో దెబ్బలు తిన్న కార్యకర్తలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అదే రోజు సాయంత్రం ఫోన్‌చేసి పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని