logo

కలెక్టరేట్‌..రైట్‌ రైట్‌

మేడ్చల్‌ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(కలెక్టరేట్‌) అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భవనం బుధవారం ప్రారంభమైంది. రూ.56.20లక్షలతో 30 ఎకరాల విస్తీర్ణంలో 55 గదుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు కొలువుదీరేలా భవనాన్ని తీర్చిదిద్దారు

Published : 18 Aug 2022 03:05 IST


సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సురభి వాణీదేవి, సుభాష్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, నవీన్‌, శంభీపూర్‌ రాజు, జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శామీర్‌పేట: మేడ్చల్‌ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(కలెక్టరేట్‌) అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భవనం బుధవారం ప్రారంభమైంది. రూ.56.20లక్షలతో 30 ఎకరాల విస్తీర్ణంలో 55 గదుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు కొలువుదీరేలా భవనాన్ని తీర్చిదిద్దారు. ఇదే ప్రాంగణంలో ఒకవైపున జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, డీఆర్వో నివాస గృహాలు వేర్వేరుగా నిర్మించారు. తొలుత బుధవారం మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్‌.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ, పూజల నడుమ కలెక్టరేట్‌ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు.  అనంతరం సీఎం, మంత్రుల సమక్షంలో కలెక్టర్‌గా హరీష్‌ కొత్త కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను కేసీఆర్‌ అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ను జిల్లా ప్రజలు, యంత్రాంగం తరఫున సన్మానించారు. మరో వారం రోజుల్లో జిల్లా కార్యాలయాలన్నీ నూతన భవనానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

నృత్యాలు చేస్తూ సభా ప్రాంగణానికి వస్తున్న బంజారా మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని