logo

కానివ్వొద్దు..జంక్షన్లు జామ్‌

రాజధానిలో లక్షలమంది వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేయూత ఇవ్వడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముందుకు వచ్చారు. తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్న జంక్షన్లలో బస్టాప్‌లను వేరే చోటుకు మార్చడం

Published : 18 Aug 2022 03:05 IST

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ తోడ్పాటు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో లక్షలమంది వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేయూత ఇవ్వడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముందుకు వచ్చారు. తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్న జంక్షన్లలో బస్టాప్‌లను వేరే చోటుకు మార్చడం, బస్సులు ఆగే ప్రాంతాలు జరిపే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీ యూనివర్సిటీకి పోలీసులు అప్పగించారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా అటు పోలీసులు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా సంయుక్తంగా చర్యలు తీసుకోబోతున్నారు.
అసలు సమస్య ఏంటంటే..
సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్‌, కోఠి, కాచిగూడ రైల్వే స్టేషన్‌ వంటి గమ్యస్థానాలకు చేరిన తర్వాత ఒక్కో బస్సు 15 నుంచి 30 నిమిషాలు ఆపి తిరిగి వచ్చిన చోటకు బయలుదేరదీస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రద్దీ జంక్షన్లలో బస్సులు నిలపకుండా గమ్యస్థానాన్ని మరో రెండు మూడు స్టేజీల తర్వాత ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బంది తీరుతుందని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ రంగనాథ్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి వివరించగా ఆయన అంగీకరించారు. మరోవైపు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం బిట్స్‌ పిలానీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టీసీ, ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోచనున్నారు.


రాజధానిలో వాహనాలు: 70 లక్షలు
నిత్యం రోడ్డెక్కేవి: 50 లక్షలు
జిల్లాల నుంచి వచ్చి వెళ్లేవి: 15 లక్షలు
ట్రాఫిక్‌ సమస్య  అధికంగా ఉన్న జంక్షన్లు: 30

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని