logo

జాతీయ జెండాలు మాకివ్వండి: సకినా ఫౌండేషన్‌

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జెండాలు ఎగరేసిన నగరవాసులకు నిబంధనల ప్రకారం వాటిని జాగ్రత్త చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన పలు ఎన్జీవోలు ఆ బాధ్యతను తీసుకున్నాయి

Published : 18 Aug 2022 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జెండాలు ఎగరేసిన నగరవాసులకు నిబంధనల ప్రకారం వాటిని జాగ్రత్త చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన పలు ఎన్జీవోలు ఆ బాధ్యతను తీసుకున్నాయి. నగరంలోని తమ కార్యాలయాల వద్ద వాటిని అప్పగించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. సకినా ఫౌండేషన్‌ మంగళవారం నుంచే ప్రత్యేక సేకరణ కార్యక్రమం చేపట్టింది. సూర్యనగర్‌, టోలిచౌకి, షేక్‌పేట్‌, పాతనగరం తదితర ప్రాంతాల్లో తొలిరోజు 100 మంది వాలంటీర్లతో 4 వేల జాతీయ జెండాలను సేకరించినట్లు తెలిపింది. మున్ముందు నగరమంతా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు మహ్మద్‌ సొహైల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని