logo
Published : 18 Aug 2022 03:32 IST

క్యాన్సర్‌ శస్త్ర చికిత్సల్లో జాప్యం ఉండదిక

 నిత్యం 30-40  వరకు ఆపరేషన్లు అయ్యేలా  ఏర్పాట్లు
ఎంఎన్‌జేలో 8 మాడ్యులర్‌ థియేటర్లు సిద్ధం
ఈనాడు, హైదరాబాద్‌

అధునాతన పరికరాలు

పేద క్యాన్సర్‌ రోగులకు పెద్ద ఊరట. వసతుల కొరతతో చికిత్సల్లో జరుగుతున్న జాప్యానికి ఇక నుంచి తెరపడనుంది. నాంపల్లి ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అధునాతన హంగులు సంతరించుకుంది. కొత్తగా అత్యాధునిక సదుపాయాలతో 8 ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. మరో పది రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. థియేటర్ల నిర్మాణం.. పరికరాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చించింది. క్యాన్సర్‌ చికిత్సల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒకే ఒక ఆసుపత్రి ఎంఎన్‌జే. ఈ దవాఖానాకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు వస్తుంటారు. ప్రైవేటులో లక్షలు ఖర్చు చేసుకొని.. వ్యాధి నయం కాక.. చివరకు ఎంఎన్‌జేకు వచ్చి ఉపశమనం పొందే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 450 సాధారణ పడకలు.. 100 పిల్లల పడకలు ఉన్నాయి. నిత్యం 450-500 ఓపీ ఉంటోంది. ఏటా 20 శాతం వరకు రోగుల రద్దీ పెరుగుతోంది. తల, మెడ, నోరు, పొట్ట, కాలేయం, వ΄త్రపిండాలు,  అండాశయం, వ΄త్రాశయం.. ఇతర శరీర భాగాల్లో వచ్చే క్యాన్సర్‌కు శస్త్ర చికిత్సలు అవసరం. ప్రస్తుతం వ΄డే శస్త్రచికిత్స థియేటర్లు ఉండటంతో తమ వంతు వచ్చే సరికి రెండు, వ΄డు నెలల సమయం పడుతోందని రోగులు వాపోతున్నారు. అంతవరకు ఔషధాలతో నెట్టుకొస్తున్నారు. కణితి తొలగింపులో జాప్యం చేస్తే.. అవి ముదిరి ఇతర భాగాలకు సోకే ముప్పు ఎక్కువ. తాజాగా సిద్ధం చేసిన ఆపరేషన్‌ థియేటర్లతో ఇలాంటి రోగులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇక నుంచి ఎలాంటి జాప్యం ఉండదని.. ఒకటి రెండు రోజుల్లో శస్త్ర చికిత్సలు చేస్తామని ఎంఎన్‌జే డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత వివరించారు.

ఎన్నో రకాలుగా ఉపయోగం
* ఈ థియేటర్లను అధునాతనంగా తీర్చిదిద్దారు. ఒక్కో థియేటర్‌ను ఒక్కో చికిత్సకు కేటాయించారు. రోబోటిక్‌ శస్త్రచికిత్సలకు ఒక థియేటర్‌ను పూర్తిగా అప్పగించారు. త్వరలో ఇవి ఎంఎన్‌జేలో అందుబాటులోకి రానున్నాయి.  తక్కువ కోత.. తక్కువ రక్త స్రావంతోపాటు చిన్న కణితిని సైతం తొలగించవచ్చు.
* ల్యాప్రోస్కోపిక్‌ చికిత్సలకు ప్రత్యేకంగా మరో థియేటర్‌ కేటాయించారు. గ్రైనిక్‌ చికిత్సలు, పిల్లల్లో వచ్చే కణితి తొలగింపునకు మరో థియేటర్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ క్యాన్సర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఒక థియేటర్‌ను వినియోగించనున్నారు.
* పొట్ట, అండాశయం, కాలేయాల్లో వచ్చే క్యాన్సర్లకు నేరుగా ఆ ప్రాంతంలో కీమోథెరఫీ ఇచ్చేందుకు శస్త్ర చికిత్స చేయాలి. ఇక నుంచి శస్త్ర చికిత్స చేసి నేరుగా కీమెథెరఫీ ఇచ్చేందుకు ఒక థియేటర్‌ను వాడుకోనున్నారు. నోటి, తల, మెడ క్యాన్సర్ల చికిత్సలకు మరో అధునాతన థియేటర్‌ను కేటాయించారు.
* అత్యాధునిక ఫిల్టర్లు వాడటం వల్ల వైరస్‌ లాంటి సూక్ష్మమైన వ్యాధి కారకాలు లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ముప్పు తప్పుతుంది.
* ఒక థియేటర్‌తో మరొక థియేటర్‌ను వీడియో..ఆడియోతో అనుసంధానం చేస్తారు. తద్వారా వైద్య విద్యార్థులు పక్క థియేటర్‌లో ఏమి జరుగుతుందో.. మరో థియేటర్‌ నుంచి చూసి నేర్చుకునే అవకాశం ఉంది. Úవలం చికిత్సలకే కాకుండా విద్యార్థులకు పరిశోధనలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని