logo

లాసెట్‌లో నగర విద్యార్థుల సత్తా

టీఎస్‌లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2022 ఫలితాల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. రెండు, మూడు, ఐదేళ్ల కోర్సుల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండేళ్ల కోర్సులో సికింద్రాబాద్‌ బ్రూక్‌బాండ్‌ కాలనీకి చెందిన

Published : 18 Aug 2022 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2022 ఫలితాల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. రెండు, మూడు, ఐదేళ్ల కోర్సుల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండేళ్ల కోర్సులో సికింద్రాబాద్‌ బ్రూక్‌బాండ్‌ కాలనీకి చెందిన మండల భరత్‌భూషణ్‌ మొదటి ర్యాంకు సాధించాడు.  టాప్‌-10లో 8 మంది నగర అభ్యర్థులే ర్యాంకులు పొందారు. మూడేళ్ల కోర్సులో రామంతాపూర్‌ గణేశ్‌నగర్‌కు చెందిన ఈమని హర్ష యశస్కర్‌ 3వ ర్యాంకు సాధించాడు. మరో ముగ్గురు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఐదేళ్ల కోర్సులో నాగార్జుననగర్‌ కాలనీకి చెందిన కె.శ్రీచరణ్‌యజ్వీ మొదటి ర్యాంకు సాధించాడు. మరో ఏడుగురు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు