logo

ప్రతి జిల్లాలో వైద్య, నర్సింగ్‌ కళాశాలలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్‌ కళాశాలనూ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేష్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నిలోఫర్‌ ఆసుపత్రి, నర్సింగ్‌ శాఖ ఆధ్వర్యంలో తొలిసారి రాష్ట్రస్థాయి నర్సింగ్‌ సదస్సును నిలోఫర్‌ ఆసుపత్రిలో నిర్వహించారు.

Published : 18 Aug 2022 03:32 IST

సదస్సును ప్రారంభిస్తున్న డీఎంఈ రమేష్‌రెడ్డి, వైద్యులు రవికుమార్‌, లాలూప్రసాద్‌, జ్యోతి

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్‌ కళాశాలనూ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేష్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నిలోఫర్‌ ఆసుపత్రి, నర్సింగ్‌ శాఖ ఆధ్వర్యంలో తొలిసారి రాష్ట్రస్థాయి నర్సింగ్‌ సదస్సును నిలోఫర్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్‌ రమేష్‌రెడ్డి హాజరై నర్సుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇలాంటి నర్సింగ్‌ సదస్సులను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని మెడికల్‌ కళాశాలల్లో నిర్వహించాలన్నారు. నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, నిలోఫర్‌ గ్రేడ్‌-1 సూపరింటెండెంట్‌ ఎం.హెచ్‌.లక్ష్మి మాట్లాడారు. నిలోఫర్‌ ఆసుపత్రి ఆర్‌ఎంఓ(సీఎస్‌) డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌, ప్రొ.డాక్టర్‌ రవికుమార్‌, పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అపర్ణ, గైనిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజేశ్వరి, పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ భువనేశ్వరితో పాటు అన్ని విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నర్సులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని