logo

మునుగోడు ఉపఎన్నికకే పది లక్షల పెన్షన్లు: డీకే

మునుగోడు ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పది లక్షల పెన్షన్ల పథకాన్ని ముందుకు తీసుకొచ్చారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో దళితబంధు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Published : 18 Aug 2022 03:32 IST

జూబ్లీహిల్స్‌: మునుగోడు ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పది లక్షల పెన్షన్ల పథకాన్ని ముందుకు తీసుకొచ్చారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో దళితబంధు తీసుకొచ్చారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15న ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని కేసీఆర్‌ అవమానపర్చారన్నారు. కేసీఆర్‌లా అబద్ధాలు చెప్పడం మోదీకి రాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఎలా, ఎంత దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లపాలైన విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తిచేస్తానని, ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు పూర్తికాలేదన్నారు. జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ అమ్ముడుపోయారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని