logo

స్నేహితుల ముందు గొప్ప కోసం..దొంగతనాల బాట

స్నేహితుల ముందు గొప్పకోసం చోరీల బాట పట్టిన యువకుడిని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్సై వెంకటేష్‌ కథనం ప్రకారం.. శ్రీకృష్ణనగర్‌లో నివసించే దర్శకత్వ విభాగంలో పనిచేసే జి. ప్రసన్న గణేష్‌కు ప్రగతినగర్‌లో కార్యాలయం ఉంది

Published : 18 Aug 2022 03:44 IST

వరుస చోరీల నిందితుడు అరెస్ట్‌

రఘు

జూబ్లీహిల్స్‌: స్నేహితుల ముందు గొప్పకోసం చోరీల బాట పట్టిన యువకుడిని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్సై వెంకటేష్‌ కథనం ప్రకారం.. శ్రీకృష్ణనగర్‌లో నివసించే దర్శకత్వ విభాగంలో పనిచేసే జి. ప్రసన్న గణేష్‌కు ప్రగతినగర్‌లో కార్యాలయం ఉంది. గత నెల 24న కార్యాలయానికి తాళం వేసి ఊరెళ్లి ఈనెల 1న తిరిగొచ్చారు. తాళం పగులగొట్టి కనిపించింది.పలు కెమెరాలు, బ్యాటరీలు, మెమోరీ కార్డులు చోరీకి గురైనట్లు గుర్తించారు. పక్కనే నివసించే రైల్వే విశ్రాంత ఉద్యోగి జీవీ శర్మ నివాసంలోనూ చోరీ జరిగింది. ప్రసన్నగణేష్‌ ఈనెల 2న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. నవోదయ కాలనీలో నివసించే డాక్టర్‌ కపిల్‌ శర్మ కుటుంమంతా ఊరెళ్లగా జులై 5న వారింట్లో చోరీ జరిగింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపరిశోధన విభాగ డీఎస్సై వెంకటేష్‌ దర్యాప్తు చేశారు. బేగంపేట మయూర్‌ మార్గ్‌ సమీపంలో నివసించే, ఇంటర్మీడియట్‌ చదివిన రఘు(22) ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అతడ్ని బుధవారం అరెస్ట్‌ చేసి రెండు కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొమ్ముతో స్నేహితులకు రఘు పార్టీలు ఇవ్వడం, గొప్పలకు పోవడం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలోనూ కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోరీ కేసులో అరెస్టయినట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని