logo

ఉచిత ఇంజినీరింగ్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సదస్సు 21న

ఉస్మానియా వర్సిటీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(హెచ్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉచితంగా ఇంజినీరింగ్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్రం సంచాలకుడు ప్రొ.కె.స్టీవెన్‌సన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 19 Aug 2022 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(హెచ్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉచితంగా ఇంజినీరింగ్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్రం సంచాలకుడు ప్రొ.కె.స్టీవెన్‌సన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటలకు ఓయూలోని ఇంజినీరింగ్‌ కళాశాలలోని అసెంబ్లీ హాలులో సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 20లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, వివరాలకు 98850 85670 నంబరులో సంప్రదించాలన్నారు.టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ.ఎ.గోవర్ధన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తదితరులు పాల్గొంటారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని