logo

కరోనా కట్టడికి అహర్నిశలు కృషి

దేశంలో కరోనా మొదటి కేసు మొదలైనప్పట్నుంచి మహమ్మారి కట్టడికి అహర్నిశలు పనిచేసినట్లు పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ సంచాలకురాలు ప్రియా అబ్రహం తెలిపారు. గురువారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన డాక్టర్‌

Published : 19 Aug 2022 02:06 IST

జాతీయ వైరాలజీ సంస్థ సంచాలకురాలు ప్రియా అబ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో కరోనా మొదటి కేసు మొదలైనప్పట్నుంచి మహమ్మారి కట్టడికి అహర్నిశలు పనిచేసినట్లు పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ సంచాలకురాలు ప్రియా అబ్రహం తెలిపారు. గురువారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు స్మారక ఉపన్యాసంలో ఆమె మాట్లాడారు. 2020 జనవరిలో దేశంలో తొలి కరోనా కేసు వెలుగు చూసినప్పటి నుంచి ఊపిరి సలపలేనంత వేగంతో పనిచేసినట్లు చెప్పారు. ఆర్టీపీసీఆర్‌ కిట్లను తయారు చేసి దేశంతోపాటు వివిధ దేశాలకు పంపించినట్లు చెప్పారు.  యాంటీ బాడీ పరీక్షలు, వ్యాక్సిన్లకు తగ్గట్టుగా వైరస్‌లను నిర్వీర్యం చేయడం, సీరో సర్వే, జీనోమిక్‌ సర్వే వంటి ఎన్నో పనులు నిర్వహించి వైరస్‌ కట్టడిలో వైరాలజీ సంస్థ సభ్యులు కీలక పాత్ర పోషించారన్నారు. హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ.బీజేరావు, వర్సిటీ మెడికల్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొ.గీత కె.వేముగంటి, వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని