logo

హైదరాబాద్‌ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యత చేపట్టాక, అంతకుముందు జరిగిన నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విపక్షాలకు సవాల్‌ విసిరారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని,

Published : 19 Aug 2022 02:06 IST

విజేతకు బహుమతి అందజేస్తున్న మంత్రి తలసాని, కాలేరు వెంకటేశ్‌. చిత్రంలో ఉమారాణి, విజయ్‌కుమార్, శ్రీలత

అంబర్‌పేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యత చేపట్టాక, అంతకుముందు జరిగిన నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విపక్షాలకు సవాల్‌ విసిరారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు గురువారం అంబర్‌పేటలో కార్పొరేటర్‌ విజయ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉప మేయర్‌ మోతె శ్రీలత, కార్పొరేటర్లు పద్మ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని