logo

భాషా చక్రవర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి

తెలుగుపై పరిశోధనలు చేసి భాషా చక్రవర్తిగా వేటూరి ప్రభాకరశాస్త్రి పేరొందారని ఎస్వీ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. గురువారం త్యాగరాయ గానసభలో.. జరిగిన ప్రముఖ చరిత్రకారులు వేటూరి ప్రభాకరశాస్త్రి జయంతి కార్యక్రమంలో

Published : 19 Aug 2022 02:06 IST

నివాళులర్పిస్తున్న కొల్లి నాగేశ్వరరావు, కేశవాచార్యులు, ఇనాక్, శ్రీలతావర్మ, కళా జనార్దనమూర్తి, జయసూర్య

గాంధీనగర్‌ , న్యూస్‌టుడే: తెలుగుపై పరిశోధనలు చేసి భాషా చక్రవర్తిగా వేటూరి ప్రభాకరశాస్త్రి పేరొందారని ఎస్వీ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. గురువారం త్యాగరాయ గానసభలో.. జరిగిన ప్రముఖ చరిత్రకారులు వేటూరి ప్రభాకరశాస్త్రి జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇనాక్‌ మాట్లాడుతూ,  విమర్శకుడిగా, నాటకకర్తగా, చరిత్రకారుడిగా వేటూరి గొప్ప సాహితీసంపదను అందించారన్నారు. గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి, కొల్లి నాగేశ్వరరావు, డా.కేశవాచార్యులు, జయసూర్య, శ్రీలతావర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని