logo

సాయంత్రం ఓపీలు వెలవెల!

ఎంతో సదుద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన సాయంత్రం ఓపీ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. చాలా ఆసుపత్రుల్లో 10 నుంచి 30 మందిలోపే హాజరవుతున్నారు. ఈ ఓపీ సేవలపై సమాచారం లేకపోవడం ఒక కారణమైతే.. తూతూ మంత్రంగా చేపడుతుండటంతో ఆదరణ లేదు.

Published : 19 Aug 2022 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంతో సదుద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన సాయంత్రం ఓపీ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. చాలా ఆసుపత్రుల్లో 10 నుంచి 30 మందిలోపే హాజరవుతున్నారు. ఈ ఓపీ సేవలపై సమాచారం లేకపోవడం ఒక కారణమైతే.. తూతూ మంత్రంగా చేపడుతుండటంతో ఆదరణ లేదు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలతో పాటు, రక్త, మూత్ర ఇతర చిన్న పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

ఇవీ కారణాలు.. వైద్యుల్లో చాలా మందికి ప్రత్యేక ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయి. వాటికి వెళ్లే హడావుడిలో ఇక్కడ తూతూమంత్రంగా కానిచ్చి జారుకుంటున్నారు. కొందరు సీనియర్‌ వైద్యులు సాయంత్రం ఓపీలకు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా రోగులు కూడా సాయంత్రం ఓపీలకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిని ఒక ప్రణాళికా బద్ధంగా నిర్వహించడంతోపాటు ప్రత్యేక కౌంటర్లు, బోర్డులు ఏర్పాటు చేస్తే.. సాయంత్రం ఓపీలకు సైతం ఆదరణ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని