logo

కరోనా సైరన్‌

దేశ రాజధానిలో నిత్యం 2 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ పది మంది వరకు మృత్యువాతపడుతున్నారు. వ్యాప్తి రేటు పెరగడంతో అక్కడ ప్రభుత్వం మాస్క్‌ తప్పనిసరి చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వేల మంది వెళ్లి వస్తుంటారు.

Published : 19 Aug 2022 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశ రాజధానిలో నిత్యం 2 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ పది మంది వరకు మృత్యువాతపడుతున్నారు. వ్యాప్తి రేటు పెరగడంతో అక్కడ ప్రభుత్వం మాస్క్‌ తప్పనిసరి చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వేల మంది వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో మన వద్ద కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 15మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకొని వారం పాటు ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. జన సమూహాల్లోకి వస్తే మాస్క్‌ ధరించడం, చేతి శుభ్రత కొనసాగించాలన్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకొని ఆరు నెలలు దాటిన వారు బూస్టర్‌ డోసు వేసుకోవడం మంచిదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని