logo

వరుణ ప్రతాపం

ఒక్కసారిగా గురువారం నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. సాయంత్రం 6గంటల సమయంలో సుమారు గంటసేపు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. చాలా మంది

Published : 19 Aug 2022 02:34 IST

స్తంభించిన ట్రాఫిక్‌


కాచిగూడ బస్‌డిపో మార్గంలో నిలిచిన వర్షపు నీరు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్కసారిగా గురువారం నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. సాయంత్రం 6గంటల సమయంలో సుమారు గంటసేపు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. చాలా మంది ఆఫీసుల నుంచి ఆ సమయానికి ఇంటికి బయల్దేరడంతో.. వాహనాలు రోడ్లపై పెద్దఎత్తున ఆగిపోయాయి.  కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్‌, మియాపూర్‌, అల్విన్‌ కాలనీ, ప్రగతి నగర్‌, నిజాంపేట, బోయిన్‌పల్లి, సికింద్రాబా, కాప్రా, మల్కాజిగిరి, మౌలాలి, బేగంపేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, తార్నాక, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరిలో రహదారులపై మోకాల్లోతున నీరు నిలిచింది. గరిష్ఠంగా రాత్రి 8గంటల వరకు బాలానగర్‌ ఫిరోజ్‌గూడ కమ్యునిటీ హాల్‌ ప్రాంతంలో 3.45సెం.మీ వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని