logo

రైతు బజార్లలో మినీ కంపోస్టు ప్లాంట్లు

రైతు బజార్లలో చెత్తకు విరుగుడుగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కొత్త ప్రణాళికలు రచించింది. మిగిలిపోయిన, పాడైన కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోగైన చెత్తను సేకరించి అప్పగించే బాధ్యతను

Published : 19 Aug 2022 02:34 IST

ఈనాడు హైదరాబాద్‌: రైతు బజార్లలో చెత్తకు విరుగుడుగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కొత్త ప్రణాళికలు రచించింది. మిగిలిపోయిన, పాడైన కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోగైన చెత్తను సేకరించి అప్పగించే బాధ్యతను రైతు బజారు నిర్వాహకులకు అప్పగించనుంది. తర్వాత పని నిరుద్యోగ యువతకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రతి రైతు బజారులో మినీ కంపోస్టు ఎరువు ప్లాంటును ఏర్పాటుకు సహకరించి నిర్వహణ బాధ్యతలు యువతకే అప్పగించాలని పేర్కొంది.

సేంద్రియ ఎరువు తయారీ.. అమ్మకం

మినీ ప్లాంట్‌కు అవసరమైన యంత్ర పరికరాలను బ్యాంకు రుణంతో నిరుద్యోగ యువతకు ఇప్పించి, వాటి వినియోగంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి రైతు బజారులో అర టన్ను నుంచి టన్ను వరకు చెత్త పోగవుతుందని అంచనా వేశారు. ఆ చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేయించి మళ్లీ రైతులకు తక్కువ ధరకు అమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బడా పార్కులు, కాలనీల్లో పార్కులకు కూడా కిలో రూ.2నుంచి రూ.5 వరకు అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

చెత్తకు మోక్షం

రైతుబజార్లలో పోగైన చెత్తను జీహెచ్‌ఎంసీ ప్రతి రోజూ తీసుకెళ్తోంది. ఒక్కోసారి తీసుకెళ్లకపోతే అక్కడ ఉన్న కుండీలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. నగరంలో 11 రైతుబజార్లుండగా.. పోగైన చెత్తను బోయిన్‌పల్లిలోని ఇంధన ఉత్పత్తి ప్లాంట్‌కు కూడా తరలిస్తున్నారు. ఇదంతా వ్యయప్రయాసలతో సాగుతోంది. ఈ నేపథ్యంలో, రైతుబజార్లలోనే మినీ కంపోస్టు ఎరువు ప్లాంట్ల ఏర్పాటుతో అన్ని విధాలా ప్రయోజనమని అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని