logo

పొదుపు సంఘాలతో.. ప్లాస్టిక్‌ నివారణ

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు పొదుపు సంఘాల మహిళలు నడుం బిగించారు. చేనేత వస్త్రాలు, నార ఉత్పత్తులు, కాగితంతో చేతి సంచులు తయారు చేసి ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నియంత్రించే చర్యలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీలోని

Published : 19 Aug 2022 02:34 IST

ప్రత్యేక  కార్యాచరణ రూపొందించిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు పొదుపు సంఘాల మహిళలు నడుం బిగించారు. చేనేత వస్త్రాలు, నార ఉత్పత్తులు, కాగితంతో చేతి సంచులు తయారు చేసి ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నియంత్రించే చర్యలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీలోని పట్టణ సామాజిక అభివృద్ధి(యూసీడీ) విభాగం.. నగరంలోని స్వయం సహాయక బృందాలను ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. పర్యావరణ హిత చేతి సంచుల తయారీలో అతివలను భాగస్వామ్యం చేస్తూ, అందుకు వారికి బ్యాంకు రుణాలూ ఇప్పిస్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చేతి సంచుల తయారీ ప్రారంభించారు. కొందరు ఫ్లిప్‌కార్డ్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకూ సంచులను విక్రయిస్తున్నారు.

రూ.50 వేల బ్యాంకు రుణం..

మొదటి దశ లాక్‌డౌన్‌ను ఎత్తేశాక చిరువ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర సర్కారు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి రూ.10వేల రుణం ఇచ్చింది. రుణం తీర్చిన వారు రెండో దశలో రూ.20వేలు తీసుకున్నారు. మూడో దశలో యూసీడీ విభాగం మధ్యవర్తిత్వంతో బ్యాంకులు రూ.50వేల రుణాలిస్తున్నాయి.  ప్రస్తుతం నగరంలో ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ సీసాలు, ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధం ఉంది.  ఈ క్రమంలో నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు.. ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. అన్నిప్రాంతాల్లో చేతి సంచులు తక్కువ ధరకు లభ్యమయ్యేలా తయారీ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో ప్లాస్టిక్‌ కవర్లు కనిపించకుండా చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అన్ని సర్కిళ్లలో..

‘‘తయారు చేసిన సంచులకు మార్కెట్లో మంచి ధర లభించాలి. అప్పుడే మహిళలు వాటి ఉత్పత్తికి ముందుకొస్తారు. అలాగే.. నాణ్యమైన సరకుకే మార్కెట్లో ఆదరణ ఉంటుంది. ఈ రెండింటినీ ఏకతాటిపైకి తెస్తేనే కార్యక్రమం సఫలమవుతుంది. దీనికోసం పొదుపు సంఘాల మహిళలకు స్వచ్ఛంద సంస్థలతో శిక్షణ ఇప్పిస్తున్నాం.  ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తోన్న సంస్థలతో, చేతి సంచుల తయారీపై ఆసక్తి చూపుతోన్న మహిళలను అనుసంధానం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అని  యూసీడీ విభాగం వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని