logo

‘నూతన విద్యావిధానంలో సామాజిక న్యాయమేదీ’?

నూతన జాతీయ విద్యావిధానంలో సామాజిక న్యాయం లోపించిందని ప్రొ.హరగోపాల్‌ అన్నారు. ఈ విధానంతో బలహీన వర్గాల పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజాక్‌) ఆధ్వర్యంలో

Published : 19 Aug 2022 02:46 IST

మాట్లాడుతున్న ప్రొ.హరగోపాల్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: నూతన జాతీయ విద్యావిధానంలో సామాజిక న్యాయం లోపించిందని ప్రొ.హరగోపాల్‌ అన్నారు. ఈ విధానంతో బలహీన వర్గాల పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజాక్‌) ఆధ్వర్యంలో ‘సంక్షోభంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు’ అనే అంశంపై సదస్సు గురువారం ఓయూ గ్రంథాలయంలో నిర్వహించారు. ప్రొ.హరగోపాల్‌ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానంతో దేశంలోని విద్యా వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని వర్సిటీలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీజేఏసీ ఛైర్మన్‌ డా.ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ..  వర్సిటీలకు నిధులు కేటాయించడం లేదని, అధ్యాపకుల భర్తీ చేయడం లేదన్నారు.     కేయూ మాజీ వీసీ ప్రొ.లింగమూర్తి మాట్లాడుతూ. వర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే  అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని