logo

తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘2019 ప్రతిభా పురస్కారాల’ ప్రదానోత్సవం గురువారం వర్సిటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య జగదీశ్వర్‌రావు

Published : 16 Sep 2022 02:36 IST

పురస్కార గ్రహీతలతో జగదీశ్వర్‌రావు, ఆచార్య వెంకటరమణ, తంగెడ కిషన్‌రావు, ఆచార్య భట్టు రమేష్‌ తదితరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘2019 ప్రతిభా పురస్కారాల’ ప్రదానోత్సవం గురువారం వర్సిటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.. పలు రంగాలకు ఆధునాతన దేవాలయం తెలుగువర్సిటీ అని కొనియాడారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య వి.వెంకటరమణ,  తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు, ఆచార్య భట్టు రమేశ్‌, రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. వి.ఆర్‌.విద్యార్థి(కవిత), ప్రొ.పులికొండ సుబ్బాచారి(విమర్శ), ఎం.బాలరాజ్‌(చిత్రలేఖనం), ఎన్‌.కాంతారెడ్డి(శిల్పం), ఎస్‌.సువర్ణలత(నృత్యం), డి.వి.మోహన్‌కృష్ణ(సంగీతం), వి.మురళి(పత్రిక రంగం), మల్లాది గోపాలకృష్ణ(నాటకం), మొలంగూరి భిక్షపతి(జానపద కళారంగం), ముత్యంపేట గౌరీశంకర్‌ శర్మ(అవధానం), డా.పరిమళ సోమేశ్వర్‌(ఉత్తమ రచయిత్రి), వల్లభనేని అశ్వనీకుమార్‌(నవల/కథ)లకు పురస్కారాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని