logo

టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ ఉపాధి శిక్షణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ స్మార్ట్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ తెలిపారు. 

Published : 24 Sep 2022 02:57 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ స్మార్ట్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ తెలిపారు. 21-25 ఏళ్ల మధ్య వయసు ఉండి బీఈ, బీటెక్‌(ఐటీ, సీఎస్‌ఈ) పూర్తి చేసిన వారికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌) రీ/స్టార్ట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా లినక్స్, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, డేటాబేసెస్‌(ఫండమెంటల్స్‌), పైథాన్‌ ప్రోగ్రామింగ్‌(బేసిక్స్‌), ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ ఫండమెంటల్స్, సిస్టమ్స్‌ ఆపరేషన్స్‌ ఆన్‌ ఏడబ్ల్యూఎస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని వివరించారు. రంగారెడ్డి జిల్లా వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పేర్ల నమోదుకు ఫోన్‌ నంబర్లు:7337332606, 7337332607 సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని