logo

జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో 11 మంది సభ్యత్వాలు రద్దు

జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(జూబ్లీహిల్స్‌ క్లబ్‌) సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ(జేహెచ్‌సీహెచ్‌బీఎస్‌ఎల్‌)

Published : 24 Sep 2022 03:03 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(జూబ్లీహిల్స్‌ క్లబ్‌) సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ(జేహెచ్‌సీహెచ్‌బీఎస్‌ఎల్‌) అధ్యక్షుడితోపాటు 10 మంది మేనేజింగ్‌ కమిటీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ క్లబ్‌ పాలకమండలి సమావేశం తీర్మానించింది. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జేహెచ్‌సీహెచ్‌బీఎస్‌ఎల్‌ అధ్యక్షులు, ఓ చానెల్‌ ఎండీ బి.రవీంద్రనాథ్‌, ఉపాధ్యక్షురాలు డి.సునీలారెడ్డి, కోశాధికారి పి.నాగరాజు, సభ్యులు జె.కుసుమ్‌కుమార్‌, వీవీ రాజేంద్రప్రసాద్‌, జి.శ్రీనివాస్‌, ఆర్‌.మాధవరెడ్డి, ఎస్‌.సతీష్‌చంద్ర, ఎం.శ్రీలక్ష్మి, ఎం.ఆనంద్‌కుమార్‌, ఓంప్రకాశ్‌ అగర్వాల్‌ సభ్యత్వాలను రూల్‌ నం. 26 ప్రకారం రద్దు చేసినట్లు క్లబ్‌ అధ్యక్షులు సి.వి.రావు ప్రకటించారు.  వీరు తమ వివరణ, అభ్యంతరాలను ఆర్బిట్రేషన్‌ కమిటీకి తెలియజేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఓ ఛానెల్‌ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సభ్యత్వాన్ని గతంలో రద్దు చేసినట్లు సీవీ రావు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని