logo

కొహెడ మార్కెట్‌ లేఔట్‌ సిద్ధం

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కొహెడలో నిర్మించతలపెట్టిన హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ (పూర్తి ప్రాజెక్టు నివేదిక) సిద్ధమైంది. ప్రాథమికంగా రూపొందించిన....

Published : 24 Sep 2022 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కొహెడలో నిర్మించతలపెట్టిన హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ (పూర్తి ప్రాజెక్టు నివేదిక) సిద్ధమైంది. ప్రాథమికంగా రూపొందించిన లేఔట్‌పై ఆగస్టులో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్షించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం మంత్రి సూచించిన మార్పులు, చేర్పులతో తుది లేఔట్‌ సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో మంత్రి పరిశీలించిన అనంతరం టెండర్లు పిలుస్తామని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. బాటసింగారంలోని లాజిస్టిక్‌ హబ్‌లో తాత్కాలిక మార్కెట్‌ను కొనసాగిస్తూనే కొహెడలో కొత్త మార్కెట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే మామిడి అమ్మకాలు కూడా ఇక్కడే కొనసాగుతాయనేది స్పష్టమైంది. ఎక్కడా ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా.. తుది లేఔట్‌, ఇంజినీరింగ్‌ డిజైన్లను రూపొందించే పనిని వయాంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(గుర్‌గావ్‌)కు అప్పగించారు. దాదాపు రూ.667 కోట్లతో మార్కెట్‌ను నిర్మించనున్నారు. లేఔట్‌ ఖరారైతే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని