logo

నీటి బిల్లు కట్టేద్దామిలా

నగర వాసులు నీటి బిల్లులు చెల్లించేందుకు జలమండలి సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జలమండలి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నెలనెలా మన మీటర్‌ రీడింగ్‌ను

Published : 24 Sep 2022 03:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర వాసులు నీటి బిల్లులు చెల్లించేందుకు జలమండలి సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జలమండలి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నెలనెలా మన మీటర్‌ రీడింగ్‌ను ఫొటో తీసి యాప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తే చాలు బిల్లు వస్తుంది. ప్రస్తుతం నగరంలో కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని 4 లక్షల మంది వినియోగదారులకు తెలిపేలా జలమండలి అధికారులు ప్రచారం చేస్తున్నారు. యాప్‌, ఇతర వివరాలు ఇలా..

* ‘భారత్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో జలమండలి (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీ)ని క్లిక్‌ చేసి క్యాన్‌ నంబరు, ఎలాంటి కనెక్షన్‌, పేరు, మీటరు నంబరు, అది పనిచేస్తుందా.. లేదా.. తదితరవివరాలు పొందుపరచాలి.
* నల్లాకు అమర్చిన మీటర్‌ను ఫొటోను తీసి అప్‌లోడ్‌ చేస్తే నిమిషాల్లో బిల్లు వస్తుంది. వినియోగదారులు తప్పుడు మీటర్‌ రీడింగ్‌ ఫొటో పంపితే కృత్రిమేధ ఆ రీడింగ్‌ను విశ్లేషిస్తుంది. మరీ ఎక్కువ, చాలా తక్కువ ఉంటే తిరస్కరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని