logo

కొండాపూర్‌లో కారు బీభత్సం

కొండాపూర్‌లో పట్టపగలు ఓ మహిళ మితిమీరిన వేగంతో కారు నడపటంతో అది అదుపు తప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే పార్క్‌ చేసి ఉన్న మరో కారు మీదకు ఎక్కి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది.

Published : 24 Sep 2022 03:13 IST


పార్కు చేసిన కారుపైకి దూసుకెళ్లిన మరో కారు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: కొండాపూర్‌లో పట్టపగలు ఓ మహిళ మితిమీరిన వేగంతో కారు నడపటంతో అది అదుపు తప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే పార్క్‌ చేసి ఉన్న మరో కారు మీదకు ఎక్కి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌ కాలనీ రోడ్డు పక్కనే ప్రైవేటు స్కూల్‌ పార్కింగ్‌ ఏరియాలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఓ స్కోడా కారును పార్క్‌ చేసిన డ్రైవర్‌ అందులోనే కూర్చొని ఉన్నాడు. ఇంతలో పక్కనే ఉన్న అపార్టుమెంట్‌ నుంచి ఓ మహిళ మితిమీరిన వేగంతో తన కారు నడుపుతూ బయటకు వచ్చింది. అతివేగం కారణంగా ఆమె కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అక్కడే పార్క్‌ చేసి ఉన్న స్కోడా కారు మీదకు ఎక్కి చెట్టును ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో స్కోడా కారులో ఉన్న డ్రైవర్‌ భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. స్కోడా కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని