logo

కుళ్లిపోయిన ఖర్జూరం విక్రయం

చర్లపల్లి డివిజన్‌ కుషాయిగూడ న్యూవాసవీ శివానగర్‌కు చెందిన సంతోష్‌ డీమార్ట్‌లో శుక్రవారం ఖర్జూర ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అక్కడ ఉండగానే ఆయన కుమారుడు(4)....

Published : 24 Sep 2022 03:13 IST

డీమార్ట్‌కు రూ.30 వేల జరిమానా


వినియోగదారుడు కొనుగోలు చేసిన ఖర్జూర పండ్లు

కుషాయిగూడ, న్యూస్‌టుడే: చర్లపల్లి డివిజన్‌ కుషాయిగూడ న్యూవాసవీ శివానగర్‌కు చెందిన సంతోష్‌ డీమార్ట్‌లో శుక్రవారం ఖర్జూర ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అక్కడ ఉండగానే ఆయన కుమారుడు(4) ఖర్జూర కావాలని అడిగారు. ప్యాకెట్‌ తెరిచి ఖర్జూర ఇవ్వగా, అందులో పురుగులు, బూజు పట్టిఉండడం కన్పించింది. దుర్వాసన రావడంతో సంతోష్‌ యాజమాన్యానికి చూపించారు. వారు ఆ ఖర్జూర తయారీ కంపెనీకి చెబుతామని.. వారే సమాధానం చెబుతారన్నారు. అతను కాప్రా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వప్నకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వాటితోపాటు, గదిలో ఉన్న పప్పు దినుసులను పరిశీలించగా.. కొన్ని పుచ్చుబట్టి ఉన్నాయి. డీమార్ట్‌ యాజమాన్యానికి రూ.30 వేల జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని