logo

బిల్డింగ్‌ ట్రైబ్యునిల్‌

గడువు ముగిసి రెండు నెలలు కావొస్తున్నా ఉన్నతాధికారులు పెదవి మెదపడం లేదు. మరోవైపు భవన నిర్మాణ అక్రమాల్లో కొందరు బల్దియా అధికారులకు పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వారం

Published : 24 Sep 2022 03:33 IST

చెలరేగిపోతున్న అక్రమార్కులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధానిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి నాలుగు వారాల్లో బిల్డింగ్‌  ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తాం.

- మూడు నెలల కింద హైకోర్టుకు  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది

గడువు ముగిసి రెండు నెలలు కావొస్తున్నా ఉన్నతాధికారులు పెదవి మెదపడం లేదు. మరోవైపు భవన నిర్మాణ అక్రమాల్లో కొందరు బల్దియా అధికారులకు పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వారం రోజుల కిందట బల్దియాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా జీహెచ్‌ఎంసీ వైఖరిలో మార్పు లేదు. బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందేనంటూ సుపరిపాలన వేదిక ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. మరోసారి కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. తదనుగుణంగా ఆరేళ్ల కిందట శాసనసభలో చట్ట సవరణ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు విషయంలో పట్టుదలగా ఉన్నారు. కార్యరూపం దాల్చకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లో ఏర్పాటుకు హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు విశ్రాంత జడ్జిల పేర్లను ఎంపిక చేసి కోర్టుకు సమర్పించింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగిసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదు.

ఉపయోగమేంటి?
* జిల్లా కోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వం వహిస్తారు.
* పురపాలక శాఖ ప్రణాళికా విభాగంలో పని చేసి రిటైరైన ఉన్నతాధికారి సాంకేతిక సభ్యుడిగా ఉంటారు.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేసులన్నీ ఇందులోనే దాఖలు చేయాలి.
* తీర్పులపై హైకోర్టులో సవాల్‌ చేసుకోవచ్చు.
* అన్ని విషయాలను పరిశీలిస్తుంది కాబట్టి స్టేలు లభించే అవకాశం ఉండదు.
* అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తీర్పులిచ్చే అవకాశం ఉంటుంది.
* వెరసి అక్రమార్కుల ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు