logo

అందరూ మెచ్చేలా... ఆనందం పంచేలా..

ఏటా సద్దుల బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరికీ ప్రభుత్వం కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖిమంత్రి సబితారెడ్డి శ్రీకారం చుట్టారు. సరికొత్త నమూనాల్లో నేసిన బతుకమ్మ

Published : 25 Sep 2022 03:24 IST
ఆడపడుచులుకు బతుకమ్మ చీరల పంపిణీ
చీరలను అందజేస్తున్న మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల  

న్యూస్‌టుడే, వికారాబాద్‌: ఏటా సద్దుల బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరికీ ప్రభుత్వం కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖిమంత్రి సబితారెడ్డి శ్రీకారం చుట్టారు. సరికొత్త నమూనాల్లో నేసిన బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ‘బతుకమ్మ’ పండుగ తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.

ఆనందోత్సాహాల మధ్య..

కాకతీయుల కాలంలో కాకతమ్మ ఉత్సవాలు బతుకమ్మ పండుగగా మారి తెలంగాణలో బహుళ ప్రచారం పొందాయి. తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచులు అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ నెల 25 నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే సంబురాల్లో చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఉత్సాహంగా పాల్గొంటారు. ఇలాంటి సందర్భంలో 18 ఏళ్లు పైబడి, తెల్లరేషన్‌ కార్డు ఉన్న మహిళలందరికీ బతుకమ్మ కానుకగా చీరలు గత ఏడాది మాదిరిగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. అందరూ మెచ్చేలా చీరల పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా సన్నాహాలు చేసింది.  

పేద కుటుంబాలకు ఆసరా..

ఈసారి బతుకమ్మ చీరలను 24 నమూనాలతో 240 వర్ణాలతో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆహార భద్రత కార్డులు కలిగి, 18 ఏళ్ల వయస్సు పైబడిన 2.88 లక్షల మంది ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నారు. పౌర సరఫరాలశాఖ వారు తమ దగ్గర ఉన్న వివరాల నుంచి లబ్ధిదారుల జాబితా ప్రకారం.. జిల్లాలో 2,14,899 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో 26,913 అంత్యోదయ, 38 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 588 ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇదే ప్రాతిపదికన బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారు.  

* జిల్లాకు వచ్చిన చీరలను మండల కేంద్రాలు, గ్రామాల్లో నిల్వ ఉంచారు. ఇదివరకే సర్పంచి, పంచాయతీ ప్రత్యేక అధికారులు, రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలతో పాటు చీరల పంపిణీకి అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. ఆ మేరకు పంపిణీ చేపట్టారు.

ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తాం - కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, కోడంగల్‌ ప్రాంతాల్లో భద్రపర్చాం. రేషన్‌కార్డు ఆధారంగా చీరల పంపిణీ జరుగుతుంది. గతంలో మాదిరిగానే చౌక ధరల దుకాణాల ద్వారా చీరల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని