logo

సౌకర్యాలు మెరుగు.. పరిశ్రమలకు అనువు

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చింది. ఇందుకోసం పూడూరు మండలం తిర్మలాపూర్‌తండా, పూడూరు పంచాయతీల శివారులో పేదలకు ఇచ్చిన భూములను

Published : 25 Sep 2022 03:24 IST

రాకంచర్లలో ఏర్పాటు చేసిన రహదారి

న్యూస్‌టుడే, పూడూరు: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చింది. ఇందుకోసం పూడూరు మండలం తిర్మలాపూర్‌తండా, పూడూరు పంచాయతీల శివారులో పేదలకు ఇచ్చిన భూములను సేకరించాలని నిర్ణయించారు. అన్ని విధాలుగా అనువైన ప్రదేశం కావడంతో పరిశ్రమలు స్థాపించేందుకు 2008లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

రైతులకు పరిహారం..: భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.1.75 లక్షల చొప్పున పరిహారం చెల్లించి అప్పట్లోనే 113 ఎకరాలు తీసుకుని, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పగించింది. తగిన సదుపాయాలు కల్పించేందుకు రూ.30 కోట్లతో బీటీ రోడ్లు. నీటి సదుపాయం, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో టీఎస్‌ఐఐసీ పేరుతో అధికారులు బోర్డు మార్పుచేశారు. పూడూరు మండలం పెద్దఉమ్మెంతాల్‌ పరిధి ఉపకేంద్రం వద్ద సౌరవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, పూడూరు, పరిగి మండలాల్లోని జాఫర్‌పల్లి, కేరవెళ్లి పరిధిలో గాలిపంకల ద్వారా పవన విద్యుత్తు తయారీకి అనుమతించటంతో ప్రైవేటు సంస్థల ద్వారా స్తంభాలు అమర్చారు. ఇక్కడ నిత్యం 100 మెగావాట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.

కాటేదాన్‌ నుంచి తరలించాల్సిందే: హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌, కాటేదాన్‌లోని పరిశ్రమలను రాకంచర్లకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంది, కాని ఇప్పటివరకు నాలుగు మాత్రమే వచ్చాయి. గతేడాది ఆగస్టులో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. రాజేంద్రనగర్‌, కాటేదాన్‌లోని ఇనుము పరిశ్రమలను ఇక్కడికి తరలించే విధంగా ఆరు నెలలు గడువు విధించారు. గడువు లోగా రాకుంటే అనుమతులు రద్దుచేసి, ఇతర పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇస్తామని హెచ్చరించారు. అయినా స్పందన లేదు. ఇప్పటికే కాటేదాన్‌లోని ఇండస్ట్రియల్‌ యజమానులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించారు. పూర్తిస్థాయిలో కర్మాగారాలు ఏర్పాటయితే స్థానికులతో పాటు ఈ ప్రాంతంలోని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.


కాలుష్యం లేనివాటికి అనుమతించాలి
కమిలీబాయి, సర్పంచి తిర్మలాపూర్‌

కాలుష్యం లేకుండా ఉన్న వాటిని ఏర్పాటు చేయాలి. భూములు కోల్పోయిన ఎంతో మందికి బతుకు దెరువు భారంగా మారింది. అప్పుడిచ్చిన పరిహారంతో ప్రయోజనం లేదు. పెద్దమొత్తంలో పరిశ్రమలు ఏర్పాటయితే స్థానికులకు ఉపాధి లభించటంతో పాటు పంచాయతీకి అదనం ఆదాయం లభిస్తుంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని