logo

విశ్వేశ్వరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్‌ మాత్రమే కాదు, గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, సాహితీవేత్త అని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కొనియాడారు. మెగాసిటీ నవకళా వేదిక ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Published : 25 Sep 2022 03:24 IST

పురస్కార గ్రహీతలతో వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్‌ మాత్రమే కాదు, గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, సాహితీవేత్త అని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కొనియాడారు. మెగాసిటీ నవకళా వేదిక ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఉత్సవాలు, విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాల ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరదలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరాన్ని కాపాడేందుకు మూసీనదిని అనేక నిర్మాణాలు విశ్వేశ్వరయ్య చేశారన్నారు. తాగునీటి కోసం ఉస్మాన్‌, హిమాయత్‌ సాగర్‌ నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగు నీటి రంగాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతోందన్నారు. ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞశర్మ అధ్యక్షోపన్యాసం చేశారు. నటుడు, న్యాయవాది ఎం.హరినాథ్‌బాబు, ప్రముఖ కవి శశిబాల, కార్యక్రమ నిర్వాహకులు మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని