logo

విద్యుత్తు సంస్థల్లో మెరిట్‌ ఆధారిత పదోన్నతులు కల్పించాలి

రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో మెరిట్‌ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కోరారు. విద్యుత్తు సంస్థల్లోని అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సీనియారిటీ మెరిట్‌/ర్యాంకు ఆధారంగా పదోన్నతుల

Published : 25 Sep 2022 03:24 IST

కరపత్రంతో ఆర్‌.కృష్ణయ్య, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో మెరిట్‌ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కోరారు. విద్యుత్తు సంస్థల్లోని అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సీనియారిటీ మెరిట్‌/ర్యాంకు ఆధారంగా పదోన్నతుల కల్పనకు 2021 జనవరి 23న జారీ చేసిన టీఓఓ ఎంఎస్‌ నంబరు: 954 ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం కాచిగూడలోని హోటల్‌లో తెలంగాణ విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వెంకన్నగౌడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో డిమాండ్ల కరపత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పదోన్నతుల్లో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరగడం వల్ల సీఈలు, ఎస్‌ఈలు తదితర పోస్టుల్లో ప్రాతినిధ్యం కరవైందని వాపోయారు. 2014 నుంచి కల్పించిన పదోన్నతులను సమీక్షించి బీసీ ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నేతలు గుజ్జ కృష్ణ, బ్రహ్మేంద్రరావు, విజయ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, యాదగిరి, చంద్రుడు, కిశోర్‌, సత్యనారాయణ, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని