logo

హద్దు మీరొద్దు.. గీత దాటొద్దు!

నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తలెత్తకుండా కేటాయించిన ప్రదేశాల్లోనే తమ వాహనాలు నిలపాలని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ సూచించారు. శనివారం బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో.. ట్రాఫిక్‌ పోలీసు అధికారులు జీహెచ్‌ఎంసీ,

Published : 25 Sep 2022 03:24 IST

ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తలెత్తకుండా కేటాయించిన ప్రదేశాల్లోనే తమ వాహనాలు నిలపాలని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ సూచించారు. శనివారం బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో.. ట్రాఫిక్‌ పోలీసు అధికారులు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, రవాణాశాఖ, ఆటోయూనియన్లు, వీధి వ్యాపారుల సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, సాఫీగా రాకపోకలు సాగించేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టామని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించటం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు తమ వాహనాలను కూడళ్లు, బస్‌స్టాపు/బస్‌బేలలో నిలపొద్దన్నారు. నిబంధనలు పాటించని ఆటోలను సీజ్‌ చేస్తామని, పదేపదే అతిక్రమించేవారిపై 341 ఐపీసీ కింద క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లను ఆక్రమించే చిరు వ్యాపారులను తరలించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ట్రాఫిక్‌ నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై జీహెచ్‌ఎంసీ అధికారులతోనూ మాట్లాడారు. ట్రాఫిక్‌ డీసీపీలు ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, పి.కరుణాకర్‌, అదనపు డీసీపీ ఎస్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని