logo

భార్య అన్నం వండలేదని.. భర్త ఆత్మహత్య

భార్య అన్నం వండలేదన్న సాకుతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీస్‌ల వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల ప్రాంతానికి చెందిన బద్రీనాగరాజు(35), విజయ దంపతులు జీవనోపాధికి నగరానికి వచ్చారు.

Published : 25 Sep 2022 03:24 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే: భార్య అన్నం వండలేదన్న సాకుతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీస్‌ల వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల ప్రాంతానికి చెందిన బద్రీనాగరాజు(35), విజయ దంపతులు జీవనోపాధికి నగరానికి వచ్చారు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీ రహదారి నం-7లో ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. దినసరి కూలీ అయిన బద్రీనాగరాజు రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి భర్త రాకకోసం ఎదురుచూసింది. అతను రాకపోవడంతో  అందరూ ఇంట్లో ఉన్న చపాతీలు తిని పడుకున్నారు. అర్ధరాత్రి తాగిన మత్తులో ఇంటికొచ్చిన బద్రీనాగరాజు భార్యను అన్నం పెట్టమని అడగ్గా.. ఆమె వండలేదని సమాధానమివ్వడంతో కోపోద్రిక్తుడై ఘర్షణ పడ్డాడు. ఆమె ఇంటి బయటికి వచ్చింది. అనంతరం ఇంట్లోని రాడ్డుకు చీర కట్టి బద్రీనాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఈ తరహాలో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. శనివారం భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై శివాజీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని