logo

రాత్రి 10 తర్వాత శబ్దాలొద్దు.. మైనర్లను అనుమతించొద్దు

పబ్బుల నుంచి రాత్రి 10 గంటల తర్వాత శబ్దాలు బయటకు రావొద్దని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని, లైసెన్సింగ్‌ నిబంధనలకు లోబడి నిర్వాహకులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Published : 25 Sep 2022 03:24 IST

పబ్బుల నిర్వాహకులతో సైబరాబాద్‌ సీపీ

ఈనాడు, హైదరాబాద్‌: పబ్బుల నుంచి రాత్రి 10 గంటల తర్వాత శబ్దాలు బయటకు రావొద్దని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని, లైసెన్సింగ్‌ నిబంధనలకు లోబడి నిర్వాహకులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని పబ్బుల నిర్వాహకులతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమై, హైకోర్టు ఆదేశాలను వివరించారు. ‘‘శబ్దాలు నిబంధనలకు లోబడి ఉండాలి. బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించాలి. సిబ్బంది, వినియోగదారుల పర్యవేక్షణకు ఈ బృందం సేవల్ని వినియోగించుకోవాలి. ధ్వని కాలుష్యం, పార్కింగ్‌ సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ నగరం, రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలి’’ అని సూచించారు. అదనపు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌, మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని