logo

సంప్రదాయం.. సంస్కారం.. పరోపకారం

సంప్రదాయం.. సంస్కారం.. పరోపకారం లక్ష్యంగా పాతికేళ్ల క్రితం ప్రారంభమైన కైరళి అసోసియేషన్‌ రజతోత్సవానికి సిద్ధమైంది. సహజ వనరులు.. అపారమైన ప్రకృతి సంపదతో ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’గా పేరొందిన కేరళ నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల

Published : 25 Sep 2022 03:47 IST

నేడు కైరళి అసోసియేషన్‌ రజతోత్సవం

కేరళ సంప్రదాయ వల్లంకలి క్రీడ

ఈనాడు, హైదరాబాద్‌: సంప్రదాయం.. సంస్కారం.. పరోపకారం లక్ష్యంగా పాతికేళ్ల క్రితం ప్రారంభమైన కైరళి అసోసియేషన్‌ రజతోత్సవానికి సిద్ధమైంది. సహజ వనరులు.. అపారమైన ప్రకృతి సంపదతో ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’గా పేరొందిన కేరళ నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన మలయాళీలు నగరంతో మమేకమయ్యారు. తొలుత రక్షణ శాఖలో ఉద్యోగులుగా వచ్చిన వీరు.. అల్వాల్‌ ఎంఈఎస్‌ కాలనీ, బొల్లారం, కౌకూర్‌ పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. 40 మందితో మొదలైన అసోసియేషన్‌లో ప్రస్తుతం రెండువందల కుటుంబాలు ఉన్నాయి. ఆదివారం అసోసియేషన్‌ రజతోత్సవం అల్వాల్‌లో నిర్వహించనున్నట్లు కైరళి అధ్యక్ష, కార్యదర్శులు కెకె గుప్తన్‌, రవినాయర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని