logo

అక్కడ కాంపౌండర్లే.. వైద్యులు

అసలు వారు ఏ వైద్య శాస్త్రం చదువుకోలేదు. కానీ వైద్యుల్లా అవతారమెత్తారు. ఎంబీబీఎస్‌ పట్టా దేవుడెరుగు.. కనీసం ఆర్‌ఎంపీ ధ్రువీకరణ పొంద లేదు. కానీ రోగులకు మాత్రం చికిత్స చేస్తున్నారు. కొన్ని చోట్ల కాంపౌండర్లే వైద్యులు.. గ్రేటర్‌ వాప్తంగా గత రెండు

Updated : 25 Sep 2022 05:55 IST
అర్హత లేని వారితో వైద్య సేవలు
తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు

ఆసుపత్రి సీజ్‌ చేస్తున్న అధికారిణి

ఈనాడు, హైదరాబాద్‌: అసలు వారు ఏ వైద్య శాస్త్రం చదువుకోలేదు. కానీ వైద్యుల్లా అవతారమెత్తారు. ఎంబీబీఎస్‌ పట్టా దేవుడెరుగు.. కనీసం ఆర్‌ఎంపీ ధ్రువీకరణ పొంద లేదు. కానీ రోగులకు మాత్రం చికిత్స చేస్తున్నారు. కొన్ని చోట్ల కాంపౌండర్లే వైద్యులు.. గ్రేటర్‌ వాప్తంగా గత రెండు రోజుల నుంచి వైద్యఆరోగ్య శాఖ జరుపుతున్న తనిఖీల్లో విస్తుగొలిపే నిజాలు బయట పడుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు, నకిలీ వైద్యులు, సిబ్బంది పని పట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ శుక్ర, శనివారాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రధాన నగరంలో 49 ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలను తనిఖీలు చేస్తే.. ఏకంగా 19 ఆసుపత్రుల్లో లోపాలు బయట పడ్డాయి. ఇందులో రెండింటిని అధికారులు సీజ్‌ చేశారు. షేక్‌పేట్‌లోని ఎస్‌.కె.డయోగ్నోస్టిక్స్‌ సెంటర్‌తోపాటు మఠపతి చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఉంది. మరో 14 షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డిలో 53 చోట్ల తనిఖీలు చేపట్టగా...36 ఆసుపత్రుల్లో లోపాలను గుర్తించి వాటికి నోటీసులు జారీ చేశారు. మేడ్చల్‌లో 38 ఆసుపత్రులు తనిఖీలు చేయగా.. ఏడింటిలో లోపాలు వెలుగు చూశాయి.  హైదరాబాద్‌ జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ వెంకటి, రంగారెడ్డి, మేడ్చల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని