logo

యోగా భాగ్యం.. ప్రకృతి చికిత్సాలయం

బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ప్రాంగణంలోని వేమన యోగా పరిశోధన సంస్థ యోగా మందిరం సాధకులతో సందడిగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాచీల వారీగా యోగాసనాలు వేస్తూ తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.

Published : 25 Sep 2022 03:47 IST

యోగా చేస్తున్న సాధకులు

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ప్రాంగణంలోని వేమన యోగా పరిశోధన సంస్థ యోగా మందిరం సాధకులతో సందడిగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాచీల వారీగా యోగాసనాలు వేస్తూ తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా అంతంతమాత్రంగా నిర్వహించిన యోగా తరగతులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రత్యేక తరగతులూ ఉన్నాయి. రోజూ యోగా చేయడానికి 250 మంది వరకు వస్తున్నారు.


మోకాలి నొప్పుల నివారణకు పరిశోధన చేస్తున్నాం:
- డా.మాలతీశ్యామల, వేమన యోగా పరిశోధన సంస్థ డైరెక్టర్‌

కొవిడ్‌ తరువాత పూర్తిస్థాయిలో యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో సాధకులు వస్తున్నారు. వీరందరికీ ముగ్గురు యోగా టీచర్లు, ఇద్దరు ప్రాణాయమం చేయించే ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. ఆపరేషన్‌ లేకుండా ప్రకృతి వైద్యం, యోగాతో ఎలా నయం చేయవచ్చో ప్రస్తుతం పరిశోధన చేస్తున్నాం. సాధారణ ప్రసవానికి యోగా ఎంతవరకు ఉపయోగపడుతుందో శోధిస్తున్నాం. ఇక్కడ యోగా చేసిన ఐదుగురు గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగింది. యోగా చేయడానికి వచ్చేవారిలో తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఫీజులో రాయితీ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని