logo

నేరగాళ్లకు పండగ

పండగల సీజన్‌ వచ్చేసింది. దసరాతో మొదలైన సందడి సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరోవైపు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.

Published : 25 Sep 2022 03:47 IST

ఆన్‌లైన్‌ కొనుగోలుదారులే లక్ష్యంగా మోసాలు

ఈనాడు- హైదరాబాద్‌: పండగల సీజన్‌ వచ్చేసింది. దసరాతో మొదలైన సందడి సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరోవైపు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఆన్‌లైన్‌ కొనుగోలుదారులే లక్ష్యంగా మోసాలకు తెర తీస్తున్నారు. ప్రత్యేక బహుమతి గెలిచారంటూ వల విసిరి బ్యాంకు ఖాతాలు గుల్ల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఉదంతాలు మరింత పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పక్కా సమాచారంతో.. సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులు కొనుగోలు చేసిన వారి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. కొత్త వస్తువు ఆర్డర్‌ పెట్టిన ఒకటి, రెండ్రోజుల్లో నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. ‘మీరు ఫలానా వెబ్‌సైట్‌లో కొనుగోలు వస్తువుపై డ్రా తీశాం. మీరు కారు గెల్చుకున్నారు. కారు కావాలంటే మీ వివరాలు పంపాలి’ అంటూ నమ్మిస్తున్నారు. నిజమేనని నమ్మిన కొందరు బుట్టలో పడిపోతున్నారు. తర్వాత జీఎస్టీ, డెలివరీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలంటూ జేబు ఖాళీ చేసి ఫోన్‌ ఆపేస్తున్నారు. ఇప్పటివరకూ సైబర్‌ నేరస్థులు.. వివిధ రాష్ట్రాల నుంచి హిందీలో మాట్లాడుతూ మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ.. తేలిగ్గా నమ్మిస్తున్నారు.


ఉచిత బహుమతులంటే నమ్మొద్దు
- మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

ఉచితంగా బహుమతులు వస్తున్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. రూ.వెయ్యి విలువైన వస్తువు కొన్నందుకు రూ.లక్షల విలువైన బహుమతిగా ఇస్తామంటే కచ్చితంగా అనుమానించాలి. ఫోన్‌, మెయిల్‌, బ్యాంకు పాస్‌వర్డ్‌ వంటివి ప్రతి మూడు నెలలకోసారి మార్చుకోవాలి. సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోతే ఆలస్యం చేయకుండా 1903 నంబరుకు ఫిర్యాదు చేయాలి. వీలైనంత తొందరగా నేరగాళ్ల బ్యాంకు ఖాతా స్తంభింపజేస్తాం. పోగొట్టుకున్న సొమ్ము ఇప్పిస్తాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts