logo

సెంచరీ కొట్టేసిన చిక్కుడు

నగరంలో కిలో చిక్కుడు సెంచరీ దాటేసింది. మెహిదీపట్నం రైతుబజార్‌లో శనివారం కిలో చిక్కుడు రూ.105కు విక్రయించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.120వరకు పలికింది. ఇటీవల భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల దిగుమతి తగ్గి,

Published : 25 Sep 2022 03:47 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: నగరంలో కిలో చిక్కుడు సెంచరీ దాటేసింది. మెహిదీపట్నం రైతుబజార్‌లో శనివారం కిలో చిక్కుడు రూ.105కు విక్రయించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.120వరకు పలికింది. ఇటీవల భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల దిగుమతి తగ్గి, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో 10కిలోల ధర రూ.600గా నిర్ణయించారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే అధికంగా పెంచి గుడిమల్కాపూర్‌ రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.120కి విక్రయించారు. తక్కువ దిగుబడి, తదితర కారణాలతో గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు శనివారం 63 క్వింటాళ్లు, రైతుబజార్‌కి కేవలం 50 కిలోలు మాత్రమే వచ్చిందని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ సీనియర్‌ కమీషన్‌ ఏజెంట్‌ జి.శివరత్నం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని