logo

కిమ్స్‌లో బాలిక మెడకు అరుదైన శస్త్రచికిత్స

జలుబుతో ప్రారంభమై.. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌గా మారి మెడ ఎముకలు దెబ్బతిన్న మూడేళ్ల చిన్నారికి కొండాపూర్‌ కిమ్స్‌ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.  ఆర్థోపెడిక్స్, స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ కె.శ్రీకృష్ణ చైతన్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు

Published : 25 Sep 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: జలుబుతో ప్రారంభమై.. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌గా మారి మెడ ఎముకలు దెబ్బతిన్న మూడేళ్ల చిన్నారికి కొండాపూర్‌ కిమ్స్‌ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.  ఆర్థోపెడిక్స్, స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ కె.శ్రీకృష్ణ చైతన్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ పరాగ్‌ శనివారం మీడియాకు వివరాలను విడుదల చేశారు. నగరానికి చెందిన బాలిక(3)కు మెడ భాగంలో నొప్పి తదితర సమస్యలు తలెత్తాయి. కిమ్స్‌ వైద్యులు ఆ బాలికకు అట్లాంటో-ఆక్సియల్‌-ఇన్‌స్టెబిలిటీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల మెడ ఎముకలు కేవలం 2.5 మిల్లీమీటర్ల చుట్టు కొలతతోనే ఉండటం వల్ల శస్త్రచికిత్స చేయడం, స్క్రూలు బిగించడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో  హెర్బెర్టీ అనే అతి సూక్ష్మ స్క్రూలు ఉపయోగించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించాం. సమస్య ఉన్న ప్రాంతంలో ఎముకలు కలిపేందుకు సరైన భాగం లేకపోవడంతో బాధితురాలి తల్లి కటి ప్రాంతం నుంచి ఎముకను సేకరించి అతి సూక్ష్మ స్క్రూలు, వైర్ల సాయంతో సి1, సి2 ఎముకల జాయింట్లను సరిచేసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts