logo

ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది: కిషన్‌రెడ్డి

భారతీ జీవన విధానంలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏబీవీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌ సహకారంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి అందజేసిన అంబులెన్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Published : 25 Sep 2022 04:08 IST

అంబులెన్స్‌ను ప్రారంభించి నడుపుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వెంగళ్‌రావునగర్, న్యూస్‌టుడే: భారతీ జీవన విధానంలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏబీవీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌ సహకారంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి అందజేసిన అంబులెన్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రారంభించి కాసేపు స్వయంగా నడిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్‌ విభాగం అడిషనల్‌  డైరెక్టర్‌ డా.పరమేశ్వర్‌నాయక్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డా.విజయజ్ఞానేశ్వర్‌రెడ్డి, ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ అధికారి డా.రామచంద్రారెడ్డి, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రక్తదాన శిబిరం..

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవచ్చని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు సందీప్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో శనివారం శాలివాహనగర్‌ కాలనీ కమ్యూనిటీహాల్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్‌రెడ్డి రక్తదానం చేసిన వారిని అభినందించి, ధ్రువపత్రాలు అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని